ఈటీవీ నెం 1 స్థానం లో కొనసాగడానికి కారణమైన షో లలో జబర్దస్త్ కామెడీ షో ఒకటి. ఇటీవల కాలంలో జబర్దస్త్ కామెడీ షో నుండి నాగబాబు తప్పుకున్న విషయం తెల్సిందే. నాగబాబు తప్పుకోవడంతో అంతా కూడా జబర్దస్త్ పనైపోయింది అంటూ కామెంట్స్ చేశారు. ఇతర చానల్స్ ఐతే చాలా ఆనంద పడ్డాయనే చెప్పాలి. నాగబాబు వల్లే జబర్దస్త్ కొనసాగుతోందని.. నాగబాబు లేకుంటే జబర్దస్త్ ను ఎవరు చూస్తారంటూ సోషల్ మీడియాలో కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. జబర్దస్త్ నుండి నాగబాబు వెళ్లి పోయి రెండు వారాలు అయ్యింది. రెండు వారాల ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. రోజాతో పాటు గెస్ట్ జడ్జ్ లను తీసుకు వచ్చి జబర్దస్త్ ను రన్ చేస్తున్నారు. నాగబాబు వచ్చినా రాకున్నా జబర్దస్త్ ఏమాత్రం ఆగదని మొన్నటి వారం టిఆర్పి రేటింగ్ స్పష్టం చేసింది . ప్రేక్షకులు అలవాటు పడింది జబర్దస్త్ కామిడి కే కాని నాగబాబుకు కాదని నాగబాబుకి కూడా ఈపాటికే అర్థమైఉంటుంది.వ్యక్తులు శాశ్వతం కాదని సంస్థయే శాశ్వతం అని జబర్దస్త్ మరొకసారి నిరూపించింది.సంస్థను నమ్ముకున్న వ్యక్తులు కనిపిస్తారు కానీ వ్యక్తిని నమ్ముకున్న సంస్థలు లేవని జబర్దస్త్ రుజువు చేసింది.నాగబాబు లేక పోవడంతో మల్లెమాల వారు జబర్దస్త్ ను క్లోజ్ చేస్తారేమో అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది.
