హెబ్బా పటేల్.. తెలుగు ఇండస్ట్రీలో 2014లో అలా ఎలా అనే చిత్రంద్వారా పరిచయమైనా, 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ తనకి మంచి గుర్తింపునిచ్చింది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో కుర్రకారుని ఆకట్టుకుంది. అంతేకాకుండా అప్పట్లో ఆ చిత్రం మంచి త్రెండింగ్ లో నడిచింది. ఇంక ఆ తరువాత తన నటనకు ఫిదా అయిన డైరెక్టర్స్ తనపై దృష్టి పెట్టారు. అంతే ఇంక వరుస సినిమాలు చేయడం మొదలుపెట్టింది. కాని అందులో కొన్నే బాగున్నాయని చెప్పాలి. ఇంక మొన్న వచ్చిన 24కిస్సేస్స్ కూడా ఫ్లాప్ అవ్వడంతో మొదటికే మోసం వచ్చింది. దాంతో అవకాశాలు అన్ని సన్నగిల్లిపోయాయని చెప్పాలి. దాంతో ప్రస్తుతం తన అందచందాలను విరజిల్లెలా హాట్ పిక్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
