న్యూజిలాండ్ లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ఐలాండ్ లో అగ్నిపర్వతం విస్ఫోటనం కావడంతో 13మంది ప్రాణాలు కోల్పోయినట్టు న్యూజిలాండ్ ప్రధాని జాకిందా ఆర్డెర్న్ మంగళవారం మీడియా ముందు చెప్పారు. అంతేకాకుండా ఈ ఘటనలో మరో ఐదుగురు తప్పిపోనట్లు ఆమె చెప్పారు. వైమానిక దళాలు వారిని కనిపెట్టే ప్రయత్నం చేసినా వారి ఆచూకి తెలియేదని తెలుస్తుంది. ఈ ఘటన జరిగిన సమయంలో ఈ ఐలాండ్ లో ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, చైనా మరియు మలేషియా నుండి వచ్చిన పర్యాటకులు మరియు వారితో ఉన్న న్యూజిలాండ్ గైడ్ లు ఉన్నారు.