ఆదివారం తిరువనంతపురం వేదికగా ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు వెస్టిండీస్. దాంతో నిర్ణీత 20ఓవర్స్ లో భారత్ 170 పరుగులు చేసింది. ఇక అసలు విషయానికి వస్తే చేజింగ్ కి వచ్చిన కరేబియన్స్ నిమ్మదిగా ప్రారంభించారు. అతే భువనేశ్వర్ వేసిన ఓవర్ లో లూయిస్ ఇచ్చిన తేలికపాటి క్యాచ్ ను పంత్ వదిలేసాడు. దాంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ధోని, ధోని అని అరవడం మొదలుపెట్టారు. దాంతో బౌండరీ దగ్గరే ఉన్న కోహ్లి ఫ్యాన్స్ వైపు కోపంగా చూడడం కెమెరాకు చిక్కింది. అంతే ధోని ఫ్యాన్స్ కోహ్లిపై విరుచుకుపడ్డారు.