ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సరికొత్త బాధ్యతలను స్వీకరించారు. ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ)చైర్మన్ గా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించనున్నారు.
ఈ మేరకు ఎస్ఐపీబీని పునర్నిర్మాణం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. బోర్డు సభ్యులుగా మంత్రులు రాజేంద్రనాథ్,సుభాష్ చంద్రబోస్ ,రామచంద్రారెడ్డి,సత్యనారాయణ,కన్నబాబు,జయరాం,గౌతమ్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. కన్వీనర్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని వ్యవహరిస్తారు.