టీవీ ఛానళ్ల డిబెట్లలో అడ్డదిడ్డంగా నోరుపారేసుకునే టీడీపీ నేతల్లో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ముందువుంటారు. గతంలో టీడీపీ హయాంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌పై జరిగిన హత్యాప్రయత్నంలో విజయమ్మ పాత్ర ఉందంటూ…రాజేంద్ర ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురైంది. ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా విషయంలో బాబుకు వత్తాసు పలకపోయి..రాజేంద్రప్రసాద్ పరువు పోగొట్టుకున్నాడు. అరేయ్..ఒరేయ్ అంటూ సభ్యసమాజం విన్లేని విధంగా ఇరువురు నేతలు బూతులు తిట్టుకున్నారు. తాజాగా మరో సారి రాజేంద్రప్రసాద్ శాసనమండలి వేదికగా మంత్రులపై నోరుపారేసుకున్నాడు. ఇవాళ శాసనమండలిలో గ్రామసచివాలయాలపై వాడీ వేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ భవనాలకు రంగులు విషయంలో ప్రభుత్వాన్ని టీడీపీ ఎమ్మెల్సీలు తప్పుపట్టారు. ఈ విషయంపై రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కొమ్ములొచ్చాయని అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై మంత్రులు పెద్దిరెడ్డి, కన్నబాబు మండిపడ్డారు. రాజేంద్రప్రసాద్‌ది టీవీ డిబేట్లలో అరే..ఒరే అని బూతులు తిట్టించుకునే సంస్కృతి అని ఎద్దేవా చేశారు. ఇక పంచాయతీ భవనాలకు రంగులు మార్చాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని, జాతీయ జెండా దిమ్మెలకు రంగులు మార్చమని చెప్పలేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. గతంలో టీడీపీ ఎలా వ్యవహరించిందో అలానే చేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే సభలో కొమ్ములొచ్చాయంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మంత్రులు స్పీకర్‌ను డిమాండ్ చేశారు. కాగా గ్రామ సచివాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు జాతీయ జెండా దిమ్మెలకు వైసీపీ రంగులు వేస్తున్నారంటూ టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నుంచి, ప్రజలకు ఇచ్చే సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫాల సంచులకు, మరుగుదొడ్లకు, ఆఖరికి అప్పడాలపై కూడా పచ్చ రంగు, చంద్రబాబు ఫోటో ముద్రించి ప్రచారం చేసుకున్న ఘనత టీడీపీది. అలాంటిది ఇప్పుడు జాతీయ జెండా దిమ్మెలకు, గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేస్తున్నారంటూ…టీడీపీ రాజకీయం చేస్తోంది. అయితే రంగుల విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే ఫాలో అవుతున్నామే కాని నిబంధనలను ఎక్కడా అతిక్రమించడం లేదని మంత్రి పెద్ది రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా అసెంబ్లీలో టీడీపీ రంగుల రాజకీయం బెడిసికొట్టింది. రాజేంద్రప్రసాద్‌కు రంగుపడింది.
