తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన కార్మికులు,ఉద్యోగులతో ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ అయిన సంగతి విదితమే. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. మధ్యాహ్నాం లంచ్ కూడా ఏర్పాటు చేశారు.
ఈ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు పలు హామీల వర్షం కురిపించారు. అందులో భాగంగా మహిళ ఉద్యోగులకు రాత్రి పూట ఎనిమిది గంటల వరకు విధులు పూర్తి.. ప్రస్తుతం ఉన్న యూనిఫాం మార్పు.. ఉద్యోగుల తల్లి దండ్రులకు ఉచిత బస్ పాసు.. వైద్య సౌకర్యం తదితర హామీలను కురిపించారు ముఖ్యమంత్రి..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఆర్టీసీ అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ప్రస్తుతం మహిళ ఉద్యోగులకు ఉన్న యూనిఫాం స్థానంలో చెర్రీ కలర్లో ఉన్న ఆఫ్రాన్ ను ధరించేలా డ్రస్ కోడ్ మారింది. అన్ని డిఫోలల్లో రాత్రి ఎనిమిది గంటల్లోపే మహిళ ఉద్యోగులకు విధులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. మహిళ ఉద్యోగులకు ఇవ్వడానికి తొమ్మిది వేల ఆఫ్రాన్లను సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు.