శ్రీకాకుళంలోనూ ఉల్లిపాయల కోసం పాట్లు తప్పడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న కిలో ఉల్లిపాయల కోసం గంటల పాటు క్యూ లైన్లో ఎదురు చూపులు చూస్తున్నారు ప్రజలు. ఎక్కువసేపు నిల్చోలోకే వృద్ధులు సొమ్మసిల్లి పడి పోతున్నారు. తాజాగా శ్రీకాకుళంలోని రైతు బజారులో ఉల్లికోసం క్యూ లైన్లలో నుంచిని ఓ వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు. నరసింహారావు అనే వృద్ధుడు ఉల్లిపాయలకోసం వచ్చి నిలబడలేక పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా గుడివాడలో మరో వృద్ధుడు క్యూలైన్లో నిలబడి గుండెపోటుతో మరణించాడు.
