తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడిగా ఉంటూ ఒక్కసారిగా పార్టీపై ధిక్కార స్వరం వినిపించి పార్టీ అధ్యక్షుడు తో పాటు తనకు అడ్డు వచ్చిన ప్రతి ఎమ్మెల్యేని ఇష్టానుసారంగా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. యధావిధిగా గన్నవరం నుంచి ఉదయాన్నే అసెంబ్లీకి బయలుదేరి వచ్చిన వంశీ ఎప్పుడు మాదిరిగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం మీటింగ్ లకు హాజరయ్యేవారు కానీ ఇప్పుడు నేరుగా అసెంబ్లీ హాల్ లోకి వచ్చేసారు. అలానే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరితోనూ కలవలేదు. అన్న వైపు చూస్తూనే నవ్వుతూ నమస్కారం పెట్టి వంశీ టిడిపి ఎమ్మెల్యేలకు కేటాయించిన స్థలంలో చివర వరకు వెళ్లి ఒక్కొరే కూర్చుండిపోయారు. అతి కొద్ది మంది టిడిపి ఎమ్మెల్యేలు మాత్రం ఆయనను పలకరించగా వంశీ ప్రతి నమస్కారం చేశారు. తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ కి వెళ్తాను అని చెప్పిన వంశీ ఇప్పటివరకు వైసిపి తీర్థం పుచ్చుకోలేదు. టెక్నికల్గా ఏమాత్రం అవసరం వచ్చిన తృణప్రాయంగా తనకు తెలుగుదేశం పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే వంశి ప్రకటించిన విషయం తెలిసిందే.
