తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం నాణ్యమైన విద్యనందించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు మోడల్ స్కూళ్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. గత ఐదేళ్ళుగా మోడల్ స్కూళ్లల్లో పలు సంస్కరణలతో నాణ్యమైన విద్య.. ఆరోగ్యకరమైన పౌష్ఠికాహరాన్ని అందించడంతో మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది.
దీంతో రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లు ప్రగతిపథంలో కొనసాగుతున్నాయి. విద్యపరంగా వెనకబడిన మండలాల్లో ఏర్పాటుచేసిన ఈ స్కూళ్లు మంచి విజయాలను నమోదు చేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలతో పోల్చితే ఇవి మెరుగైన ఫలితాలను నమోదుచేస్తున్నాయి.
గ్రామీణ విద్యార్థులు పెద్దసంఖ్యలో ముందుకు వస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో విద్యాప్రగతికి 100 మోడల్ స్కూళ్లలో బాలికలకు ప్రత్యేక హాస్టళ్లను కూడా ఏర్పాటుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన మొత్తం 194 మోడల్ స్కూళ్లలో
2019-20 విద్యా సంవత్సరంలో మొత్తం 1,32,116 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.