Home / ANDHRAPRADESH / కార్యకర్తలపై మరోసారి అసహనం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్..!

కార్యకర్తలపై మరోసారి అసహనం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్..!

సినీ స్టార్‌గా పవన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే మెగా హీరోల సినిమా ఫంక్షన్‌లల్లో పవన్ స్టార్ అంటూ స్లోగన్లు ఇస్తూ… పవన్ ఫ్యాన్స్ నానా రచ్చ చేసేవారు.. ఫ్యాన్స్ అల్లరిని మొదట్లో అందరూ లైట్ తీసుకున్నా..అది రాను రాను శ్రుతిమించింది. ..పిచ్చిగా కేకలు పెడుతూ పవన్‌పై తమ అభిమానాన్ని చాటుకునేవారు. క్రమంగా పవన్ ఫ్యాన్స్‌పై దురభిమానులుగా ముద్ర పడింది. ఫ్యాన్స్ గోల తట్టుకోలేక..ఒక్కోసారి మెగాస్టార్ చిరు సైతం కోప్పడిన ఘటనలు ఉన్నాయి. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలుగా అవతారమెత్తారు. కత్తి మహేష్, శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మలతో తలెత్తిన వివాదాల్లో పవన్ తన అభిమానులను కంట్రోల్ చేయలేకపోయాడన్న విమర్శలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయంలో కార్యకర్తల అతి కూడా కారణమని చెప్పవచ్చు. ఏ ఊరికి వెళ్లినా పవన్‌ను మాట్లాడనీయకుండా అల్లరి చేసేవారు. మొత్తంగా కార్యకర్తలను క్రమశిక్షణలో పెట్టడంలో విఫలమయ్యాడన్న విమర్శలు పవన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ తరచుగా కార్యకర్తలు, అభిమానులపై అసహనం వ్యక్తం చేసేవాడు. తాజాగా మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. . ‘మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయాను. మీతో నాకు ఇబ్బందిగా ఉంది’ అంటూ పార్టీ కార్యకర్తలపై పవన్‌ ఫైర్ అయ్యాడు. డిసెంబర్ 8 న తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలో జనసేన అధినేత పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బాబు అండ్‌ బాబు కన్వెన్షన్‌ హాలులో రైతులతో జరిగిన సమావేశంలో పవన్‌ మాట్లాడుతుండగా జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కేరింతలతో ఈలలు వేశారు. దీంతో పవన్‌ స్పందిస్తూ…కార్యకర్తలకు క్రమశిక్షణ ఉండి ఉంటే జనసేన పార్టీ గెలిచేదని మండిపడ్డారు. సభలో ఎవరూ అవరొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే సినీ స్టార్‌గా, ఓ రాజకీయ పార్టీ అధినేతగా పవన్‌ పట్ల అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనడంలో సందేహం లేదు. అయితే నిజంగా కార్యకర్తల అతితో ఓడిపోయాను అనడం పవన్‌‌ స్థాయికి సరికాదు. సొంతంగా ఎదగలేక చంద్రబాబుతో కుమ్మక్కు రాజకీయాలు చేసినందుకే ప్రజలు పవన్‌కల్యాణ్‌ను నమ్మలేదు. జనసేన పార్టీని ఆదరించలేదు..పవన్‌‌ను సైతం రెండు చోట్ల చిత్తుగా ఓడించారు. అంతే కాని తనను చూసి అత్యుత్సాహపడే కార్యకర్తల వల్ల ఓడిపోయాను అనడం పవన్ కల్యాణ్‌‌కు సరికాదు. మొత్తంగా పవన్ కల్యాణ్..తను రాజకీయంలో వేసే తప్పటడుగులను కప్పిపుచ్చుకోవడానికే ఇలా కార్యకర్తలను పదే పదే అవమానిస్తున్నాడని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat