ఉల్లి ధరల అంశంపై స్పందిస్తూ అసెంబ్లీలో సీఎం వైయస్.జగన్ స్పందిస్తూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మేం కార్యక్రమాలను చేస్తున్నాం. దేశం మొత్తమ్మీద∙ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే రూ.25లకు అమ్ముతోంది. ఇంత తక్కువ రేటుకు అమ్ముతున్న రాష్ట్రం మన రాష్ట్రమే అన్నారు. ప్రతి రైతు బజార్లోనూ కేజీ రూ.25లకే అమ్ముతున్నాం. ఇంతవరకూ 36,500 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతు బజార్లలో కేజీ రూ.25లకు అమ్ముతున్నాం. రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరకడంలేదని షోలాపూర్, ఆల్వార్ లాంటి చోట్లనుంచి కూడా కొనుగోలు చేస్తున్నాం. ఎక్కడ దొరికినా కొనుగోలు చేస్తున్నాం.ఇదే చంద్రబాబుగారి హయాంలో ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు కాక, పొలాల్లోనే వదిలేసిన పరిస్థితులు చూశాం. ఇవాళ రైతులకూ మంచిరేటు లభిస్తోంది. మరోవైపు వినియోగదారులకు నష్టం రాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుని రూ.25లకు అమ్ముతున్నాం. చంద్రబాబుగారి హెరిటేజ్ షాపులో కేజీ ఉల్లి రూ.200లకు అమ్ముతున్నారు. వీళ్లు ఇక్కడకు వచ్చి… పేపర్లు పట్టుకుని దిగజారిపోయి మాట్లాడుతున్నారు. వీళ్లు చేసే పనులకు న్యాయం, ధర్మం అనేది ఎక్కడైనా ఉందా అ«ధ్యక్షా..? మహిళల భద్రతమీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది దేశంలో కూడా సంచలనాత్మకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్త చట్టాలు తీసుకు వచ్చి ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. ఉన్న చట్టాలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో కూడా చర్చ జరగాలి మహిళలకు భద్రత ఎలా కలిగించాలన్న దానిమీద మంచి చర్చ జరగాలి. మహిళల భద్రతకోసం కొత్త చట్టంకూడా తీసుకు రాబోతున్నాం, దానిమీద కూడా చర్చ జరగాలి అన్నారు సీఎం జగన్.
