ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శీతాకాల సమావేశాల్లో బిఎసి సమావేశానికి ముందు స్పీకర్ షార్ట్ డిస్కషన్ కు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి టిడిపి నుంచి కొంత మంది సభ్యులు తమ సందేహాలను ఆడుతుండగా మంత్రులు లేదా ప్రభుత్వ పెద్దలు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని విద్యుత్ కొనుగోలు విషయంలో పలు ప్రశ్నలు అడిగారు. అయితే రామానాయుడు అంతటితో ఆగిపోలేదు. జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పి పి ఎ లు, రివర్స్ టెండరింగ్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని మొదటి రోజే విమర్శించేందుకు పలు వ్యాఖ్యలు చేశారు దీంతో సభలోని అధికార పార్టీ సభ్యులంతా ఒక్కసారిగా ఆగ్రహించారు.
