తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అత్యున్నత కార్యక్రమం చేప పిల్లల పంపిణీ.
మత్స్యకారులకు చేయూతనందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈ కార్యక్రమం సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. ఈసారి రికార్డు స్థాయిలో 63.27కోట్లకు పైగా చేపపిల్లలను చెరువులు,కుంటల్లో వదిలారు.
మరికొన్ని చోట్ల త్వరలోనే దాదాపు తొంబై లక్షలకు పైగా చేపపిల్లలను అధికారులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఇరవై ఏడు జిల్లాల్లో ఈ కార్యక్రమం పూర్తయింది.
మిగిలిన ఐదు జిల్లాల్లో కూడా త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.