భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, హైదరాబాద్ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం కాకినాడలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్వేత జయంతితో సాయిప్రణీత్ వివాహం జరిగింది. సాత్విక్ సాయిరాజు సహా పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ పెళ్లికి హాజరయ్యారు. సాయిప్రణీత్-శ్వేత జంటకు సోషల్ మీడియా ద్వారా వివిధ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సాయిప్రణీత్ అంతర్జాతీయస్థాయిలో అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో కాంస్యం గెలిచిన భారత ప్లేయర్‌గా నిలిచాడు. కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న సాయిప్రణీత్‌ను ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ‘అర్జున అవార్డు’తో సత్కరించింది.