జనసేన పార్టీ కీలక నాయకుడు పవన్ కళ్యాణ్ కు కుడిభుజంగా వ్యవహరిస్తున్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు ఒక్కసారిగా సంచలనం రేపుతున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ బాధ్యతారహితంగా మాట్లాడడం తన ఓటమికి అభిమానులు కార్యకర్తలు కారణమని చెప్పుకోవడంతో పాటు పార్టీపరంగా సరైన సిద్ధాంతాల్ని అవలంభించడం లో పవన్ విఫలమయ్యాడని అందుకే రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేన నుంచి నాదెండ్ల వెళ్ళిపోతే ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని కచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ పొలిటికల్ గా గైడ్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు పర్యటనలు మీటింగ్లు కార్యకర్తల తో సమావేశాలు అన్ని చూసుకుని నాదెండ్ల ప్రస్తుతం పార్టీకి దూరం అయితే ఇక జనసేన పార్టీ కోలుకునే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.
