Home / BUSINESS / ఉల్లితో పాటు భారీగా పెరిగిన మునక్కాడ రేట్లు

ఉల్లితో పాటు భారీగా పెరిగిన మునక్కాడ రేట్లు

దేశంలో పెరిగిన ఉల్లి ధరలతో ఇప్పటికే సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.మొన్నటి దాకా కురిసిన వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అయ్యింది.మరోపక్క చెన్నైలో ఉల్లి తో పాటు కూరగాయాల ధరలు అమాంతం పెరిగి సామాన్యు్న్ని మరింత కష్టపెడుతున్నాయి.

కోయంబత్తూరు మార్కెట్ లో ఆదివారం ఉల్లి రికార్డు ధర పలికింది. హోల్ సేల్ లో కిలో రూ.140కి చేరింది. ఉల్లి రేటు రోజురోజుకు పెరగుతుండటంతో ఉల్లిని కొనాలంటే ప్రజలు భయపడుతున్నారు. రిటైల్ మార్కెట్ లో కూడా ఉల్లి ధర రూ.160 పైనే పలుకుతుంది. మహారాష్ట్ర,ఆంద్రప్రదేశ్ నుండి వచ్చిన ఉల్లి చాలా చిన్న గా ఉన్న కూడా రేటు అమాంతం పెరగడం పట్ల మార్కెట్ మేనేజ్మెంట్ కమిటీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంత రేటు పెట్టి కొనాలంటే సామాన్యులకు ఇబ్బందే, చాలా మంది ప్రజలు తమ వంటల్లో ఉల్లిని మానేశామంటు చెప్తున్నారు.

ఉల్లి రేటు తో పాటు కూరగాయాల రేట్లు కూడా కోయంబత్తూర్ మార్కెట్ లో అమాంతం పెరిగాయి.ములక్కాయ కిలో రూ.400 పలుకుతండడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కూరగాయాల రేట్లు,ఉల్లి రేటు అమాంతం పెరుగుతూ పోతూ సామాన్యుడి జీవితాన్ని మరింత భారం చేస్తోంది.

రాష్ట్రంలో ఉల్లి కొరత పై తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి స్పందించాడు. మరో 20 రోజుల్లో రాష్ట్రంలో ఉల్లి రేటు తగ్గుతుందని సీఎం తెలిపారు. తమిళనాడు లో వర్షప్రభావంతో ఉల్లి పంట దెబ్బతిందని,అందుకే ఇతర రాష్ట్రాల నుండి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని ఉల్లి పంట కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందని సీఎం చెప్పారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat