పశ్చిమగోదావరి జిల్లాలో బలమైన ప్రత్యర్థి సామాజికవర్గానికి చెందిన నాయకుడు, బిజెపి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తగా విద్యావేత్తగా రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన గంగరాజు గత ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు నుంచి 2014లో ఎంపీగా పోటీ చేసి ఇ బీజేపీ తరఫున గెలుపొందారు. 2019 ఎన్నికల్లో తన బంధువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుమూరు రఘురామ కృష్ణం రాజు నరసాపురం ఎంపీ గా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు బిజెపి లోనే ఉంటూ క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. అయితే గత కొద్దికాలంగా గంగరాజు ఆరోగ్యం అంతగా పండలేదు విజయవాడలోని ఆయన నివాసంలో ప్రస్తుతం గంగరాజు రెస్ట్ తీసుకుంటున్నారు. గంగరాజు వంటి బలమైన నాయకుడు వైయస్సార్ సిపి లోకి రావడం జిల్లాలో పార్టీకి మరింత దోహదపడుతుందని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. వివాద రహితుడు విద్యావేత్త వ్యాపారవేత్త సౌమ్యుడు అయినటువంటి గంగరాజు చేరికను జిల్లావ్యాప్తంగా వైసిపి కార్యకర్తలు, శ్రేణులు స్వాగతిస్తున్నారు.
