ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌లు ఉల్లిపై తెగ లొల్లి చేశారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తెదేపా నేతలు అనంతరం ఉల్లిదండలతో, ప్లకార్డులతో కాలినడకన అసెంబ్లీకి వెళ్ళారు. కిలో ఉల్లి రూ.200 సిగ్గుసిగ్గు అంటూ నినాదాలు చేశారు. లోకేష్ బాబు ఉల్లిదండను మెడలో వేసుకుని ఫోటోలకు ఫోటోలు ఇస్తే..బాబుగారేమో ఉల్లిదండను అలా స్టైల్‌గా చేత్తో పట్టుకుని అసెంబ్లీ వరకు నడిచారు. ఇక మరో పార్టనర్ జనసేన అధినేత కూడా రైతు బజార్లు తిరుగుతూ…ఉల్లిగడ్డలను కసకసా తొక్కుతూ..జగన్ సర్కార్‌పై ఉల్లి ఘాటును మించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఉల్లిపై ఇవాళ పార్టనర్ల లొల్లి చూసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కాని జగన్ రెడ్డి చేసే మేలు ఉల్లి కూడా చేయదన్నారు. అందుకు ఉల్లి సిల్లీగా..అని దాని రేటును పెంచేశారంటూ..పవన్ ట్వీట్ చేశాడు. అయితే ఉల్లి ధరల విషయంలో రాష్ట్రాలు ఏం చేయలేవు. దేశం అంతటా ఉల్లిమంటలు జగన్, కేసీఆర్‌లు మాత్రం ఏమి చేయలేరు. అయినా జగన్ సర్కార్ ప్రజలు ఇబ్బందులు పడకుండా 25 రూపాయలకే కిలో ఉల్లిని ప్రజలకు సబ్సిడీపై అందిస్తోంది. జగన్ సర్కార్‌పై కక్షసాధిస్తుందంటూ కేంద్రానికి తెగ ఫిర్యాదులు చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు ఉల్లి ధరల పెరుగుదలపై మోదీ సర్కార్‌ను పల్లెత్తు మాట అనడం లేదు. ఉల్లి ధరలపై పోరాడాల్సింది ఢిల్లీలో అమరావతిలో ఎన్ని డ్రామాలు ఆడినా ఫలితం ఉండదు. ఈ విషయాలేవి పట్టించుకోకుండా..పవన్ ఇలా పార్టనర్ల లొల్లి చేసి ట్వీటేస్తే ఆయాసమే తప్ప..మరొకటి కాదు. అయినా పవన్ తిక్కకు లెక్కలే వేరబ్బా…ఆయన ఎప్పుడు ఎవరి మీద రంకెలు వేస్తాడో..ఎవరిని పొగుడుతాడో ఆయనకే అర్థం కాదు. మొత్తానికి ఉల్లిపై పార్టనర్ల లొల్లి మాత్రం తెగ సిల్లీగా ఉంది.
