ఈ బుధవారం అసెంబ్లీ సమావేశంలో మహిళల సంరక్షణకై ఏపీ ప్రభుత్వం కఠినమైన శిక్షలు ఉండేలా బిల్లును ప్రవేశపెట్టనున్నడని సీఎం జగన్ ప్రకటించారు. ఏపీలో మహిళలపై చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాల లో నిందితులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా శిక్షలు అమలు కావడం లేదని అన్నారు. కోర్టులో ఈ తరహా కేసులు జాప్యం జరగకుండా చూడాలని జగన్ అన్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన దిశ ఘటనను దృష్టిలో ఉంచుకుని నిందితులకు శిక్షలు కఠినంగా ఉండేలా చట్టాలు చేయాలని అన్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి ఆడపిల్లలు మహిళలపై జరిగే అత్యాచార కేసులు విచారణ చేయాలని, ఇలాంటి కేసుల విచారణ రెండు వారాల లోపు పూర్తికావాలని నేరం రుజువైతే 21 రోజులలో ఉరిశిక్ష పడేలా చట్టాలు రావాలి అని సీఎం జగన్ అన్నారు. మహిళల సంరక్షణకు ప్రత్యక చట్టాలు అవసరం అని అన్నారు. ఈ బుధవారం అసెంబ్లీ సమావేశంలో వీటిపై ఒక చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టనున్నామని జగన్ తెలిపారు
