ముఖ్యమంత్రిగా జగన్ 30 ఏళ్లు పాలిస్తే రైతులు మిగలరని, వారికి ఆత్మహత్యలే శరణ్యమని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. రైతులకు నిజంగా సమస్యలు ఉంటే ధైర్యం చెప్పవలసిన నేత ఈ రకంగా ఆత్మహత్యలు అంటూ ఇష్టం వచ్చినట్లు పిచ్చి మాటలు మాట్లాడటం మంచిది కాదు. రైతుల కష్టాలు తెలుసుకుని వాటిపై చర్యలు తీసుకొనేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి. అధికారం కోసం ప్రజలకు ముద్దులు పెడితేనో, పాదయాత్రలు చేస్తేనో రైతుల కడుపు నిండదని అన్నారు. అన్నదాతల్లో 60శాతం మంది కౌలురైతులే ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని కొందరు రైతులకే పరిమితం చేయడం అన్యాయమని రైతులు అందరికి న్యాయం చేయాలంటూ పవన్ ప్రశ్నించారు. జగన్ పాలన సక్రమంగా ఉంటే తాను నిలదీయనని, రోడ్డుల వెంట ఎందుకు తిరుగుతామని ఆయన ప్రశ్నించారు..
విషయం ఏదైనా జగన్ ముప్పై ఏళ్ల పాలన చేసే అవకాశం ఉందని పవన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు అంటూ రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఎంత సమర్ధవంతంగా పాలన చేస్తే విపక్షాలనుంచి ఇలాంటి మాటలు వస్తాయి అని వ్యాఖ్యానిస్తున్నారు.