తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం వచ్చింది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో జరగనున్న ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్ సదస్సుకు మాజీ ఎంపీ కవితను హాజరవ్వాలని నిర్వాహకులు ఆహ్వానించారు.
వచ్చే ఏడాది జనవరి 9-10తారీఖుల మధ్య ఈ సదస్సు జరగనున్నది. మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ అనే అంశంపై జరగనున్న ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు,జాతీయ ఎన్నికల కమిషనర్ ఆశోక్ లావాస తదితరులు పాల్గొనున్నారు.