ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సిద్ధార్ధ తాతోలు కలిసి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు.
ముందు అనుకున్న సమయం అంటే నవంబర్ 29న చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావించగా, సెన్సార్ సమస్యల వలన చిత్రం రిలీజ్ కాలేదు.అఖరికి డిసెంబర్ 12న చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది.
అయితే ఈ సినిమాపై కేఏ పాల్ మండిపడ్డారు. సినిమాని రిలీజ్ చేయోద్దని కోర్టులో పిటీషన్ కూడా వేశారు. కానీ తాజాగా వర్మ కేఏ పాల్ నుండి సెన్సార్ సర్టిఫికెట్ అందుకుంటున్నట్టుగా మార్ఫింగ్ ఫోటోని తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు.