టాలీవుడ్ సీనియర్ అగ్రహీరో .. నందమూరి అందగాడు యువరత్న బాలకృష్ణ హీరోగా .. వేదిక,సోనాల్ చౌహాన్ అందాల ఆరబోస్తుండగా.. భూమిక ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా సి కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నూట యాబై సినిమాగా తెరకెక్కుతున్న మూవీ రూలర్.
ఈ మూవీకి చెందిన ట్రైలర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. “ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరుగా ఉంటే దీన్ని పండించిన రైతుకు ఎంత పవరు.. పొగరుంటుందో అని బాలయ్య బాబు చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ మంచి కిక్ ఇస్తుంది.
ప్రస్తుతం ఇది అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ నెల ఇరవై తారీఖున రూలర్ ప్రేక్షకుల ముందుకు రానున్నది.