హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించింది. కొన్ని మీడియా గ్రూపులు కావాలని, పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. ‘రెండు బెత్తం దెబ్బలు’ అంటూ పవన్ ఉద్దేశించి ట్వీట్ తాను చేయలేదని స్పష్టం చేసింది. వారంత సైకోల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఎన్నికలు పూర్తయ్యాయని, అయినా తనకు, తన కుటుంబానికి చేయాల్సిన నష్టమంతా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా నన్ను, ఆ ‘వ్యక్తి’ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి పిచ్చి రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రచారం చేసి తామెంత దిగజారిపోయామో తమను తాము నిరూపించుకుంటున్నారని పేర్కొంది.
వారంతా పరాజితులని పేర్కొన్న పూనం కౌర్ ‘సోల్డ్ మీడియా’(#soldmedia), ప్రెస్టిట్యూట్స్ (#presstitutes) హ్యాష్‌టాగ్‌లతో ట్వీట్ చేసింది. ఇలాంటి ‘ప్రెస్టిట్యూట్లు’, ‘పొలిటీషియన్ల’ కంటే బతుకుదెరువు కోసం ఒళ్లు అమ్ముకుని జీవించే వేశ్యలు చాలా నయమని పూనం పేర్కొంది. చేతకాని, అసమర్థులైన వీరు తమ చుట్టూ ఉన్నవారి కోసం ఏమీ చేయలేరని, అలాంటి వారు నాయకులు ఎలా అవుతారని ప్రశ్నించింది. ఇలాంటి విధ్వంసకర వైఖరి ప్రజలను కేన్సర్‌లా ఆవహిస్తోందని పూనం ఆవేదన వ్యక్తం చేసింది.