తెలంగాణతో పాటుగా యావత్తు దేశమంతా పెనుసంచలనం సృష్టించిన దిశ అత్యాచార,హత్య కేసులో నిందితులైన ఆరిఫ్,శివ,చెన్నకేశవులు,నవీన్ లు దిశను కాల్చిన ప్రదేశంలోనే ఎన్కౌంటర్లో మృతి చెందిన సంగతి విదితమే.
ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ప్ర్తముఖులు హార్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది దీన్ని వ్యతిరేకిస్తోన్నారు. దీనిపై నటుడు ఉపేంద్ర వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ” దిశ నిందితులైన నలుగురు ఆమెను హత్యాచారం చేసి కాల్చివేశారో లేదో ..?. ఈ సంఘటన వెనుక ఎవరైన ప్రముఖుల హస్తముందో..?.
ఇదే తరహాలో ఎన్కౌంటర్లు ప్రముఖుల వ్యక్తుల కేసుల్లో ఎందుకు వ్యవహరించరు..?. కోర్టులో విచారణకు ముందే ఎన్కౌంటర్ ఇకపై ప్రముఖుల కేసుల్లోనూ రెడ్ కార్పెట్ కానుందా అంటూ ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.