దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాద సంఘటనలో సుమారు 35 మృతి చెందినట్లు సమాచారం. వీరంతా దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 35 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణం తెలియలేదు. రాత్రి షిప్ట్ చేసిన కొందరు కార్మికులు అక్కడే పడుకోవడంతో ప్రమాదం వారిని కబళించింది. ఆ కుటుంబాలను విషాదవదనంలో నింపింది. ఫ్యాక్టరీ ఝాన్సీ రోడలో ఉంది. 600 చదరపు అడుగుల్లో విస్తరించి పరిశ్రమ ఉంది. కంపెనీలో చీకటి ఉండటంతో ఇంకా ఎంతమంది ఉన్నారనే అంశంపై క్లారిటీ రావడం లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అగ్నిమాపక సిబ్బందికి తెల్లవారుజామున 5.22 గంటలకు ఫోన్ చేశారు.మంటలను అదుపు చేసేందుకు 30 ఫైర్ ఇంజన్లుతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు
