ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత,కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బిగ్ షాకిచ్చారు.
టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు టీడీపీ సభ్యత్వానికి.. ఆ పార్టీ పదవులకు రాజీనామా చేస్తోన్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ లో పంపారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ” పార్టీలో నిజాయితీగా కష్టపడే వాళ్లకు సరైన గుర్తింపు లేదు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలను, ప్రజలను గాలికి వదిలేసిన చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయాక ఇప్పుడు కులాల మధ్య .. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.
త్వరలోనే నేను వైసీపీలో చేరతాను. ఏ రోజు పార్టీలో చేరతానో నా అనుచరులతో.. నాతో కల్సి వచ్చేవాళ్లతో సమావేశమై ముహుర్తాన్ని నిర్ణయిస్తానని”ఆయన తెలిపారు.