Home / BUSINESS / ఒక్క ఫోన్ కొంటే..ఒక కిలో ఉల్లిపాయాలు ఉచితం..భారీగా క్యూ కడుతున్న ప్రజలు

ఒక్క ఫోన్ కొంటే..ఒక కిలో ఉల్లిపాయాలు ఉచితం..భారీగా క్యూ కడుతున్న ప్రజలు

దేశ వ్యాప్తంగా ఉల్లిపాయ అధిక ధరలతో కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని ఒక చిన్న మొబైల్ షాప్ ఆసక్తికరమైన ఆఫర్‌తో ఆ షాపు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తంజావూరు జిల్లాలో ఎస్టీఆర్ మొబైల్స్ చేసిన ప్రకటన చూపరుల ఆసక్తిని రేకెత్తించడమే కాక ప్రజలలో వినోదాన్ని కూడా కలిగించింది. అసలు విషయానికి వస్తే పట్టుకొట్టైలోని తలయారీ వీధిలోని మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ అయిన ఎస్టీఆర్ మొబైల్స్, దుకాణం నుండి ఎవరైతే స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసినా వారికి ఒక కిలో ఉల్లిపాయలను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.

ప్రస్తుతం, ఒక కిలోల పెద్ద ఉల్లిపాయలను తమిళనాడులో 140 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఎస్‌టిఆర్ మొబైల్స్ యజమాని సరవన కుమార్ మాట్లాడుతూ ఈ ఆఫర్‌కు రిసెప్షన్ చాలా బాగుంది. ఎవ్వరూ ఇలాంటి ఆఫర్ల గురించి వినలేదు. కాబట్టి ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. ప్రకటన పెట్టినప్పటి నుండి నేను దుకాణం వద్ద మరింత అడుగు పడటం గమనిస్తున్నాను, ”అని ఆయన చెప్పారు. దుకాణం ముందు ప్రకటన పోస్టర్ పెట్టడంతో సేల్స్ కూడా బాగా పెరిగాయి. 35 ఏళ్ల శరవణ కుమార్ ఎనిమిది సంవత్సరాల క్రితం పట్టుకొట్టైలో ఎస్టీఆర్ మొబైల్స్ తెరిచారు. ఈ దుకాణం రోజుకు రెండు మొబైల్ ఫోన్‌లను విక్రయిస్తుంది. “అయితే గడిచిన రెండు రోజుల్లో నేను రోజుకు ఎనిమిది ఫోన్లు విక్రయించాను. కాబట్టి ప్రజలు ఈ ఆఫర్‌ను ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను, ”అని శరవణ చెప్పారు. తన షాపులో ఫోన్లు కొనే కస్టమర్లు ఉచితంగా చిన్న ఉల్లిపాయలు మరియు పెద్ద ఉల్లిపాయల మధ్య ఎంచుకోవచ్చు అని ఆయన చెప్పారు.ఇదిలావుండగా, 45 రోజుల్లో ఉల్లి ధర తగ్గుతుందని, ఉల్లిపాయలను దిగుమతి చేసుకుని తక్కువ ధరలకు విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తమిళనాడు ఆహార, పౌర సరఫరా శాఖ మంత్రి ఆర్ కామరాజ్ ఒక తమిళ  ఛానెల్‌కు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat