టెలికాం రంగంలో జియో వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే జియో రాకతో మొబైల్ వినియోగదారులకు చార్జీల మోత తగ్గిందని ఆనందిస్తుంటే మరోవైపు జియో కి పోటీగా ఉన్న దాదాపు అన్ని టెలికాం కంపెనీల్లో భయం మొదలయ్యింది. ఆ భయం సంస్థలను నష్టాల బాట పట్టించిందనడంలో అతిశయోక్తి లేదు.జియో ఇచ్చిన ప్యాకేజి లను ఇతర కంపెనీలు వినియెగ దారులకు అందించడంలో పోటీపడినా.. చివరకు నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు ఆ వంతు ఐడియా, వడా నెట్ వర్క్ లకు వచ్చింది.
కేంద్రనికి చెల్లించాల్సిన పాత బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఊరట చర్యలు తీసుకోవాలని, తీసుకోని పక్షంలో కంపెనీని మూసివేయక తప్పదని టెలికం సంస్థ వొడాఫోన్– ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా తన మాటలతో వివరించారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయసహకారాలు లేకపోతే ఇక వొడాఫోన్ ఐడియా కథ ముగిసినట్లేనాని స్పష్టం చేశారు.వీటిలో ఇంకా పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమాత్రం ఉండదని సంస్థను మూసేవేయడం తప్ప మరో మార్గంలేదని శుక్రవారం ఒక సదస్సులో పాల్గొన్న ఆయన తెలిపారు. అయితే ఎకానమీని గాడిలో పెట్టే దిశగా.. సంక్షోభంలో ఉన్న టెలికం రంగాన్ని ఆదుకొని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టెలికం అనేది చాలా కీలక రంగమని ప్రభుత్వం గుర్తించిందని ఆయన గుర్తు చేశారు.
మొత్తం డిజిటల్ ఇండియా కార్యక్రమమంతా టెలికాం పై ఆధారపడి ఉంది. ఇది నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి.. ప్రభుత్వం నుంచి మరింత తోడ్పాటు అవసరం అని ఆయన చెప్పారు.ఏ రకమైన ఊరట చర్యలు కోరుకుంటున్నారన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ప్రధానమైన సమస్య సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వివాదమే. ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది. ప్రభుత్వమే టెల్కోలకు వ్యతిరేకంగా ఈ కేసు వేసింది. చర్చల ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు‘ అని బిర్లా పేర్కొన్నారు. ఏజీఆర్ లెక్కింపు వివాదంలో ఇటీవల కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెలికం సంస్థలు ఏకంగా రూ. 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయీలు కట్టాల్సి వస్తుంది. దీంతో వీటికి కేటాయింపులు జరపాల్సి రావడం వల్ల వొడాఫోన్ ఐడియా సెప్టెంబరు త్రైమాసికంలో ఏకంగా రూ.50,921 కోట్ల మేర రికార్డు స్థాయిలో నష్టాలు తలెత్తాయని,. దీన్నుంచి బైటపడాలంటే.. ఉద్దీపన చర్యలు ప్రకటించడం ఒక్కటే మార్గం. జీఎస్‌టీని 15 శాతానికి తగ్గించినట్లైతే.. అదే పెద్ద ఉద్దీపన చర్య కాగలదు‘ అని బిర్లా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.