తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి జీరో ఎఫ్.ఐ.ఆర్ కేసును నమోదు చేసిన వరంగల్ కమిషనరేట్ సుబేదారి స్టేషన్ పోలీసులు.వివరాల్లోకి వెళ్ళితే… వరంగల్ రూరల్ జిల్లా, శాయంపేట మండలం గోవిందాపూర్ గ్రామానికి చెందిన బూర రవీందర్ కుమార్తే శ్రీ విధ్య 24 సంవత్సరాలు కనిపించడం లేదు.
వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో నివాసం వుంటూ పనినిమిత్తం హన్మకొండ సుబేదారి ప్రాంతానికి వెళ్లిన తన తమ్ముడైన బూర రాజ్ కుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమయిన రాజ్ కుమార్ తక్షణమే తన పరసరంలో వున్న సుబేదారి పోలీస స్టేషన్ కు వెళ్ళి తన అన్నకుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతోస్టేషన్ ఎస్.ఐ సత్యనారాయణ వెంటనే జీరో ఎఫ్ .ఐ.ఆర్ గా కేసు నమోదు చేసుకోని కేసు దర్యాప్తు నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్ కు కేసును బదీలీ చేయడం జరిగింది