బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని కల్పించిన విషయం తెలిసినదే. ఇప్పుడు ఆమె డిప్యూటీ కలెక్టర్ శిక్షణా కాలం పూర్తి చేసుకుంది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పీవీ సింధుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ఓఎస్డీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేయుట జరిగింది. ప్రస్తుతం అక్కడ ఖాళీగాఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును ఓఎస్డీగా అప్‌గ్రేడ్ చేసి సింధుకు ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ప్రొటోకాల్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. పీవీ సింధుకు 2018 డిసెంబర్ 7 నుంచి 2020 ఆగస్టు 30 వరకు ఆన్ డ్యూటీ సౌకర్యం మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సిందు బాడ్మింటన్ అంతర్జాతీయ పోటీకి సిద్దమవడానికి గతంలో సీఎం జగన్ ను కలసి తన వినతి పత్రాన్ని సమర్పించిన సంగతి తెలిసిందే ఆమేరకు బాడ్మింటన్ అంతర్జాతీయ పోటీకి సిద్దమవడానికి వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
