జబర్దస్త్ లాంటి కామెడీ షోల తర్వాత పటాస్ కూడా మరో మంచి స్టాండప్ కామెడీగా గుర్తింపు తెచ్చుకుంది. రవి, శ్రీముఖి కెమిస్ట్రీ కూడా ఈ షోకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 1100 ఎపిసోడ్లకు పైగా కలిసి చేసారు ఈ ఇద్దరూ. ఈటీవీ ప్లస్ టాప్ షోగా రేటింగ్ అందుకుంటూ వచ్చింది పటాస్. కుర్రాళ్ళే టార్గెట్గా వచ్చిన ఈ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే కంటిన్యూ చేస్తూ రోజురోజుకీ మరింత పాపులర్ అయింది పటాస్. ఈ షో నుంచి చాలా మంది కుర్ర కమెడియన్లు కూడా ఇండస్ట్రీకి వచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పటాస్ షో రేటింగ్స్ పడిపోయాయనే టాక్ వినిపిస్తుంది. శ్రీముఖి ఈ షో నుంచి తప్పుకోవడమే పటాస్ షోకు శాపంగా మారింది. రవి, శ్రీముఖి కెమిస్ట్రీనే దీన్ని నిలబెట్టింది. అయితే ఉన్నట్లుండి ఇప్పుడు ఆమె తప్పుకోవడం పటాస్ షోపై తీవ్ర ప్రభావం చూపించింది. దానికి తోడు పటాస్ టీం మారిపోయింది.ప్రస్తుతం శ్రీముఖి స్థానంలో వర్షిణిని తీసుకున్నారు. అయినా కూడా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు రవి మారిపోయాడు. రవి స్థానంలో వచ్చిన చలాకీ చంటిని తీసురున్నారు. ఈ ప్రోగ్రామ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో..?