స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అలా వైకుంఠపురం అనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఫుల్ బిజీగా ఉన్నారు అయితే దేశం మొత్తాన్ని కదిలించిన ఘటనపై టాలీవుడ్ లో కొందరు హీరోలు స్పందించారు. ఈ ఘటన జరుగుతున్న మొదటి నుంచి ఎన్కౌంటర్ వరకు బన్నీ మాత్రం స్పందించలేదు అయితే అంతటితో ఆగకుండా తన అల వైకుంఠపురం సినిమాకు సంబంధించి సామజవరగమన అన్న పాట 105 మిలియన్ వ్యూస్ దాటడంతో బన్నీ ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా ఇప్పుడు నీ పాట గురించి వేయాల్సిన అవసరం వచ్చిందా దేశం మొత్తం రగిలిపోతున్న ఘటన అని అనిపించలేదా హైదరాబాదులో వాళ్ళని అనుకుంటా చేసిన పరిస్థితి నువ్వు చూడలేదా అంటూ బన్నీ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచేస్తున్నారు. దేశం పట్ల సమాజం పట్ల ఈ హీరోలకు ఏమాత్రం బాధ్యత ఉండదు అంటూ తన అఫీషియల్ ట్విట్టర్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
