తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి కేటీఆర్ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ఎంపీ సంతోష్ పుట్టిన రోజును పురస్కరించుకుని “నిండు నూరెళ్ళు ఆయురారోగ్యాలతో ,సుఖసంతోషాలతో మరింత కాలం ప్రజలకు సేవ చేయాలని “ఆయన ట్వీట్ చేశారు.
ఈ క్రమంలో మంత్రులు గంగుల కమలాకర్ ,పువ్వాడ ,ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి,రవీంద్రకుమార్,దివాకర్ రావు తదితరులు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.