2012 డిసెంబరు 16వ తేదీ అర్ధరాత్రి తర్వాత దక్షిణ దిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు దారుణంగా అత్యాచారానికి పాల్పడి, కొన ఊపిరితో ఉన్న దశలో ఆమెను రోడ్డుపక్కన పడేశారు. ఆ ఏడాది డిసెంబరు 29న ఆమె కన్ను మూసింది. బాధితురాలి వివరాల గోప్యత కోసం ఆమె అసలు పేరుతో కాకుండా నిర్భయ కేసుగా దేశం దీనిని పిలుచుకొంటోంది. ఈఘటన
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని నిర్భయ సామూహిక అత్యాచారం కేసు నిందితుల్లో ఏఒక్కరిని వదిలిపెట్టరాదని నిందితులలో ఒకడైన వినయ్ శర్మ చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలని జాతీయ మహిళా కమిషన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కోరింది. ఈ మేరకు ఆ కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ రాష్ట్రపతికి లేఖ రాశారు. అత్యంత పాశవిక చర్యకు పాల్పడ్డ వినయ్‌కి క్షమాభిక్ష అడిగే అర్హతలేదని క్షమాభిక్ష కు తావివ్వవొద్దని లేఖలో పేర్కొన్నారు.మరోవైపు నిర్భయ ఘటనలో వినయ్ శర్మ క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు దిల్లీ ప్రభుత్వం ఆదివారం గట్టిగా సిఫార్సు చేసింది.
అతడికి అసాధారణ శిక్ష విధించాలని దిల్లీ హోంమంత్రి సత్యేందర్ జైన్ దస్త్రాన్ని ఎల్జీకి పంపించినట్లు సమాచారం. ఎల్జీ తన అభిప్రాయాన్ని కేంద్ర హోంశాఖకు తెలియజేయనున్నారు. వినయ్‌శర్మ ప్రస్తుతం తిహాడ్ కారాగారంలో ఉన్నాడు. . నిందితుల్లో ఒకడైన బాల నేరస్తుడిని సంస్కరణ గృహంలో మూడేళ్లు ఉంచారు. మరో నిందితుడు రామ్‌సింగ్ తానున్న కారాగారంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురికి ఉరిశిక్ష పడింది. నెరస్థులందరికి మరణమే తగిన శిక్ష అని క్షమాపణకు ఆస్కారం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారని అన్నారు.
