సీఎం గా ప్రమాణ స్వీకారం రోజునుంచి ప్రజాధనాన్ని ఎలా పొదుపు చేయాలి.. అని ఆలోచిస్తూ తన ప్రమాణస్వీకరాన్ని సైతం తూతూ మంత్రంగా కానిచ్చేసి నాయకులకు ఆదర్శంగా నిలిచారు సీఎం జగన్. తన జీతాన్ని సైతం రూ 1 మాత్రమే తీసుకుంటూ రాజకీయమంటే వ్యాపారం వృత్తి కావని రాజకీయమంటే సేవ అని నిరూపించారు. తాజాగా సీఎం జగన్ నివాసం,క్యాంపు కార్యాలయంకు సంబంధించి వివిధ పనులకు సంబందించిన నిధుల కేటాయింపు జీవోలు నిలుపుదల చేస్తూ ప్రభుత్వ అధికారులచే ఉత్తర్వులు జారీ చేయించారు. తాడేపల్లితో పాటు హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసానికి సెక్యూరిటీ కోసం కేటాయించిన నిధుల జీవోలు రద్దు చేసింది ఏపీ సర్కార్. తాడేపల్లి నివాసానికి ఫర్నిచర్ కొనుగోలు, విద్యుత్ సౌకర్యం, ఇతర వసతుల కోసం కేటాయించిన నిధులు తనకు వద్దని సుమారు రూ. 3కోట్ల విలువైన పనులకు సంబందించిన కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎం నివాసానికి ఏర్పాట్ల కోసం ప్రభుత్వమే నిధులు భరించాల్సి ఉన్నప్పటికీ జగన్ వద్దని వాటిని నిలుపుదల చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రద్దుకు సంబంధించి 6 జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. అధికారిక నివాసానికి నిధుల కేటాయింపుపై గతంలో ప్రతిపక్షాల విమర్శలు గుప్పించాయి. అయితే వారికి ధీటుగా సమాధానం ఇచ్చేలా జగన్ తన ఇంటికి కేటాయించిన నిధుల్ని రద్దు చేశారు. గతంలో ఏ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఈ స్థాయిలో సంరక్షించిన దాఖలాలు కనిపించవు. జగన్ దేశం లోనే ఆదర్శవంతమైన సీఎం అనడంలో ఏ సందేహములేదు.పరిపాలనలో గాని సంక్షేమ కార్యక్రమాల అమలులో గాని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కు ఏమాత్రం తీసిపోడని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
