ఇటీవల తిరుపతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విజయవాడ కృష్ణ నది తీరాన జరిగిన క్రైస్తవ సాంప్రదాయ ఆచరణ గూర్చి వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ క్రైస్తవుల మనోభవాలను దెబ్బతీస్తూ రెండు మతాల మధ్య చిచ్చుపెటే ప్రయత్నం చేసారు . దీనిని తీవ్రంగా ఖండిస్తూ పవన్ కళ్యాణ్ పై విశాఖలో క్రైస్తవ నాయకులు ధ్వజమెత్తారు.
1⃣. మూకుమ్మడి మతమార్పిడి జరిగింది, ముఖ్య మంత్రికి తెలియదా అని పవన్ ప్రశ్నించారు –
దీని గురించి ముఖ్యమంత్రికి తెలియచేయాలి అనే అధికారపు జిఓ గాని లేక రాజ్యాంగపు నియమం ఎక్కడ ఉంది? ఇది బలవంతపు మార్పిడి అని ఎవరైనా ఆరోపించారా లేక మారినవారు సాక్షం ఇచ్చారా ? వారు స్వచ్చందంగా మూకుమ్మడిగావచ్చి క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే తప్పేంటి ? అంటే లౌకిక దేశ భారత రాజ్యాంగం ఇచిన హక్కును మీరు కాలరాయాలని చూస్తున్నారా?
2⃣. ఎవరి ధైర్యం తో చేస్తున్నారు అని అడిగారు –
లౌకిక దేశ భారత రాజ్యాంగం వారికీ ఇచిన స్వేచ్ఛ, చట్టం వారికీ ఇచిన అండ వారికీ ధైర్యం ని ఇచ్చాయి. కాదనడానికి, ప్రశ్నించడానికి మీరు ఎవరు? నది ఎవరి గుత్తాధిపత్యం కాదు అందులో బాప్తిస్మము ఇవ్వడం తప్పా?
3⃣. ఎదురుగ ఉన్న ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు కానీ లేక హిందూ మతం పరిరక్షించే వారు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏమి చేస్తున్నారు అని అడిగారు –
ఒక మతం వారు శాంతియుతంగా వారి ఆచార సంప్రదాయాల ప్రకారం స్వచ్చందంగా వారి మతపరమైన కార్యకలాపాలు చేసుకుంటుంటే మీరు అవి అడ్డుకోవాలి, ఎందుకు అడ్డుకోలేదు అని రెచ్చగొడుతూ అనటం మతోన్మాద ప్రోత్సహన కాదా?
4⃣. జగన్ గారి ఇంటికి 10 కిలోమీటర్లు ఐతే ఏంటి ఇంటిలో ఐతే మీకేంటి ? ఇది చెట్టరిత్యా విరుదమా లేక నేరమా లేక అసాంగిక కార్యక్రమమా? అంటే రేపు మీరు గాని అధికారంలోకివస్తే రాజ్యాంగబద్దమైన హక్కులనుకుడా మీరు కాలరాసి క్రైస్తవ మతాన్ని మైనారిటీల మనోభావాళ్లను డెబ్బదిస్తూ వారి స్వేచ్చకు భంగం కలపెంచేవిధంగ పాలనఉంటుందా?
5⃣. హిందూ ధర్మానికి ఇది దెబ్బ అన్నారు.. అది ఎలానో చెప్పాలి.
ఆయనకి అవగాహనాలోపం ఎంత అంటే హిందూ దేవస్థాన పరిధిలో ఇతర మత ప్రచారాలు చేయకూడదు అనే జి ఓ ఇప్పటికే ఉన్నదనితెలియదు. ఇలాంటి జి ఓ ఇతరమత ప్రార్ధన స్థలాలకు లేదు అని కూడా తెలియదు. చర్చిలకు వెళ్లి జై శ్రీ రామ్ అనరు, అలాగే హిందూ దేవాలయాలకి వెళ్లి హెయిల్ జీసస్ అనకూడదు అన్నారు.. అలాంటిది ఎక్కడైనా జరిగిందా ? జరగకుండా అనకూడదు అనడం కావాలని ఒక వర్గాన్ని తప్ప్పుదోవ పట్టించడమే కదా? ..
6⃣. స్వచ్చందంగా జరిగిన ఈ సాంప్రదాయ ఆచరణని మతమార్పిడి రాజ్యాంగ విరుద్ధంకాదా అని అడిగారు ..
ఎలా విరుద్ధమో చెప్పగలరు .. మీరు చదివిన లక్ష పుస్తకాల్లో బహుశా భారత్ రాజ్యాంగం చదవలేదేమో .. సూడో సెక్కులరిజం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మీ వ్యాఖ్యలే , దాని అర్ధం పూర్తీగ తెలుసుకొని ఉపయోగించాలి.. ఎందుకంటే సెక్కులరిజంని ప్రశ్నిస్తున్న మిరే సూడో సెక్యూలరిస్ట్అని తేటతెల్లం అవుతుంది.
ఇందుమూలంగా ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ సమాజం మరియు ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా పవన్ పై మత విద్వేషాన్ని ప్రేరేపించడానికి రెచ్చగొడుతున్న తరుణంలో పోలీస్ ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. భారతీయ శిక్షాస్మృతి Section 298, Section 504, Section 295A, Section 153A, Section 505, Section 334. ప్రకారం ఫిర్యాదు సమర్పించారు.
మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టొదని ఇటువంటి వ్యాఖ్యలు వాళ్ళ అయన నిజస్వరూపం బయటపడతుందని అన్నారు ఆలివర్ రాయి. ఇదంతా చూస్తుంటే కేవలం బి జె పి మెప్పు పొందడం కోసమే అనిపిస్తుంది … మరీనా ప్రొడ్యూసర్ కి అనుగుణంగా యాక్టింగ్ చేస్తూఉన్నారేమో అనిపిస్తుంది అన్నారు ఫోరమ్ చైర్మన్ ఆలివర్ రాయి –