ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఢిల్లీ పర్యటనలో అత్యంత ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్నా సరే ఆయన అర్ధాంతరంగా తన పనులను ముగించుకుని ఇంటికి వచ్చేసారు. కొన్ని దశాబ్దాలుగా తన తాత రాజారెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేసిన నారాయణ రెడ్డి అనే వ్యక్తి గత సలహాదారుడు ఇవాళ ఉదయం మృతి చెందడంతో జగన్ హుటాహుటిన బయలుదేరి వచ్చేసారు. నారాయణ రెడ్డి జగన్ పాదయాత్ర సమయంలో కూడా చురుకైన పాత్ర పోషించారు జగన్ ముఖ్యమంత్రిగా చూడాలని తన కోరిక అని అందరికీ చెప్పేవాడు దశాబ్దాల కాలంగా వైఎస్ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఈ క్రమంలో తనను నమ్ముకున్న వ్యక్తి మృతి చెందడం పట్ల జగన్ సంతాపం వ్యక్తం చేశారు అంతేకాదు జగన్ ఒక్కరే కాకుండా తన కుటుంబ సభ్యులంతా నారాయణరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
