దిశను అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితులను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేశారు. ఎక్కడైతే ఘాతుకానికి ఒడిగట్టారో అదే స్థలంలో నిందితులు ప్రాణాలు విడిచారు. దీనిపై టాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. దిశ కేసులో నిందితులు చచ్చారు అనే వార్తలో కిక్కు ఉందంటూ టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది.. తుపాకీలకు దండం పెట్టుకోవాలని ఉంది.. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది.. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు ఉందా? ఈ రోజు నీ ఆత్మ దేవుడిని చేరింది చెల్లెమ్మా’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ”ఇప్పుడు న్యాయం జరిగింది. దిశా ఆత్మకు శాంతి కలుగుతుంది” అని పేర్కొన్నారు. ”ఈ రోజు ఉదయం లేవగానే దిశా నిందితుల ఎన్కౌంటర్ వార్త విన్నాను. ఇప్పుడు దిశా మర్డర్ కేసులో అసలైన న్యాయం జరిగింది” అని పేర్కొంటూ నాగార్జున ట్వీట్ పెట్టారు. ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మీ స్పందించారు. ఈ రోజున దిశకు అసలైన న్యాయం జరిగిందని పేర్కొన్నారు.
JUSTICE SERVED! Now, Rest In Peace Disha.
— Jr NTR (@tarak9999) December 6, 2019
ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది
ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది.
ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది.
నలుగురు చచ్చారు అనే వార్త లో ఇంత కిక్కు వుందా..??
ఈ రోజే నే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..! #JusticeForDisha #Disha #justiceforpriyanakareddy pic.twitter.com/qQ05yD9mo3— MM*??❤️ (@HeroManoj1) December 6, 2019
I do NOT feel bad. I was always against capital punishment but I've changed my mind over the years. Rapists MUST hang! Thank you kcr garu for standing as an example to our nation and showing respect to women! @RaoKavitha @KTRTRS pic.twitter.com/DdXrDmyzSJ
— Lakshmi Manchu (@LakshmiManchu) December 6, 2019
This morning I wake up to the news and JUSTICE HAS BEEN SERVED!! #Encounter
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 6, 2019