40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు జరిగిన ఎన్నికల్లో చాలా దారుణంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. దారుణంగా ఓటమి చవిచూసిన బాబు ఎలాగైనా అధికార పార్టీ పై బురద జల్లాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తాజాగా చంద్రబాబుని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రశ్నించారు. చంద్రబాబుకు రాజధాని పై అంత ప్రేమ ఉంటే సొంతంగా భవనం ఎందుకు కట్టలేదని అడిగారు. అది పక్కన పెడితే మొన్న అతని పై రాజధాని వాసులు రాళ్ళు ఎందుకు విసిరారు అదే మేము వెళ్తే ప్రజలు పూలతో ఎందుకు స్వాగతిస్తున్నారు అని అన్నారు. మంచిపనులు చేస్తే ఎవరైనా ఆదరిస్తారని మా నాయకుడు వచ్చిన కొద్దిరోజుల్లోనే ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారని అన్నారు. మా ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు చూసి పచ్చ బ్యాచ్ కు పక్షవాతం వచ్చిందని మండిపడ్డారు.