టీడీపీ అధినేత చంద్రబాబు తనకు తానే పరువు తీసుకుంటున్నాడు..అధికారంలోకి వచ్చి ఆరునెలల కూడా కాకముందే వైసీపీ సర్కార్‌పై రోజుకో టాపిక్ పట్టుకుని బురద జల్లుతున్నాడు. అమరావతి నుంచి రాజధాని తరలింపు, పోలవరం, రివర్స్ టెండరింగ్, పల్నాడు దాడులు, కోడెల ఆత్మహత్య డ్రామా, ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం ఇలా ప్రతి రోజు ఏదో ఒక అంశం పట్టుకుని ఆరునెలలుగా ప్రభుత్వంపై ఎంతగా దుష్ప్రచారం చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు..బాబుగారి బురద రాజకీయాలు ప్రజలకు తెలుసు కాబట్టి…ఆయనేం చెప్పినా పట్టించుకోవడం లేదు..బాబుగారంతేలే అని లైట్ తీసుకుంటున్నారు. ఇక తాజాగా అమరావతిలో పర్యటించి సీఎం జగన్‌ను, ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని కుట్ర చేశాడు. కాని రాజధాని రైతులు చెప్పులు, రాళ్లతో దాడులు చేయడంతో బాబుగారు పరువు పోగొట్టుకున్నాడు. అయినా బాబుగారు మారుతాడా..మళ్లీ అమరావతిపై అఖిల పక్షం పెట్టి ప్రభుత్వాన్ని తాను తిట్టడమే కాకుండా…అన్ని పార్టీల నేతలతో తిట్టిద్దామని..బాబుగారు ప్లాన్ వేశారు. అయితే చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అఖిల పక్ష సమావేశం కూడా తుస్సుమంది. చంద్రబాబునాయుడు తన అఖిలపక్షానికి వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలను, సంఘాలను ఆహ్వానించినట్లు చంద్రబాబు చెప్పుకున్నాడు. అయితే వచ్చిన వారిలో ప్రముఖ పార్టీలు మాత్రం సీపీఐ జనసేన మాత్రమే..మిగతావాళ్లంతా ఏపీ రాజకీయాల్లో సోదిలో లేని పార్టీలే. ఇక బీజేపీ బాబుగారి అఖిల పక్షాన్ని ఛీ కొట్టేసింది.. ముందే అటెండ్ కామని చెప్పేసింది. కాంగ్రెస్ పార్టీని పిలిచారు కాని..ఆ పార్టీ నేతలు ఎవరూ రాలేదు..బాబుగారి ఐరెన్ లెగ్ ఎఫెక్ట్ ఇంకా కాంగ్రెస్ వాళ్లకు పోలేదట్లుంది..భయపడి ఒక్కరూ రాలేదు..ఇక వచ్చిన సీపీఐ, జనసేన పార్టీలు కూడా తాను చెప్పిన సొల్లు పురాణం విని..వంత పాడుతారనుకుంటే…వాళ్లు బాబుగారికి మామూలుగా షాక్ ఇవ్వలేదు. అమరావతి విషయంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అనిపిస్తే.. దాని మీద విచారణ జరిపించాలే తప్ప… పనులు నిలిపివేయడం సరికాదంటూ ప్రభుత్వాన్ని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. దీంతో బాబుగారు ఖంగు తిన్నారు..తాను వీళ్లందరితో ప్రభుత్వంతో తిట్టిదామనుకుంటే..గత ఐదేళ్లలో అమరావతిలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారంటూ..బాబుగారు తెగ గుంజుకున్నారు. ఇక పార్టనర్ పార్టీ జనసేన అయినా తనకు వత్తాసు పలుకుతుందనుకుంటే..వాళ్లు బాబు గారికి హ్యాండ్ ఇచ్చారు. అమరావతిపై సీఎ జగన్ మోహన్ రెడ్డి వెంటనే ఓ అఖిల పక్షం వేసి… తన వెంట చంద్రబాబునాయుడును, పవన్ కల్యాణ్ ను కూడా తీసుకువెళ్లాలని డిమాండ్ చేసింది. దీంతో బిత్తరపోవడం బాబు వంతు అయింది. అమరావతి విషయంలో తన సారథ్యంలో అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చంద్రబాబు వేసిన ప్లాన్ రివర్సైంది. పైగా అమరావతిలో అవినీతి జరిగిందంటూ పార్టీలు మాట్లాడడంతో చంద్రబాబుకు అవమానకరంగా మారింది. మొత్తంగా అమరావతిపై అఖిల పక్షం వేసి ప్రభుత్వాన్ని ఇరుకుపడాలని చూసిన చంద్రబాబు..చివరకు తన పరువు తానే తీసుకున్నాడు..