హిట్ మాన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ప్రపంచంలో లోనే ఒక హాట్ టాపిక్ అని చెప్పాలి. ఏ రికార్డు ఐనా బ్రేక్ చెయ్యగల సత్తా అతడికి ఉందని సీనియర్ ఆటగాళ్ళు సైతం చెబుతున్నారు. మొన్నటివరకు వన్డేలు, టీ20 లే అనుకున్నారు అంతా కాని ఇప్పుడు టెస్టుల్లో కూడా నేనున్నాను అంటూ ముందుకు వచ్చి తానెంటో నిరూపించుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం రోహిత్ ఖాతాలో మరో రికార్డు చెరనుండి. శుక్రవారం జరగబోయి మొదటి టీ20 లో అతడు ఒక సిక్స్ కొడితే 400 ఇంటర్నేషనల్ సిక్ష్లు కొట్టిన మొదటి ఇండియన్ ప్లేయర్ గా నిలుస్తాడు. మరి ఈరోజు ఆ ఫీట్ సాధిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.
