దిశా హత్యకేసులో ప్రధాన నిందితులైన నలుగురు యువకులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పోలీసులు పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతున్నారు. తెల్లవారుజామునే దిశా నిందితుల ఎన్‌కౌంటర్ దిశ హత్య కేసులో నిందితులైన నలుగురినీ తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య ఎన్‌కౌంటర్ చేశారు షాద్ నగర్ పోలీసులు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో ఆ నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసేయడం జరిగింది. ఎన్‌కౌంటర్ వార్త తెలిసి టాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దిశా హత్య కేసులో ఇప్పుడు అసలైన న్యాయం జరిగిందని, పోలీసుల చర్య హర్షణీయమని పేర్కొంటున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ దిశా కేసులో న్యాయం జరిగింది అని పేర్కొంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. భయపెట్టడమే మార్గం.. సమంత ”ఐ లవ్ తెలంగాణ. భయపెట్టడమే ఇలాంటి దుశ్చర్యలకు అసలైన సమాధానం” అని సమంత ట్వీట్ పెట్టింది.
I ❤️ TELANGANA . Fear is a great solution and sometimes the only solution .
— Samantha Akkineni (@Samanthaprabhu2) December 6, 2019
JUSTICE SERVED pic.twitter.com/iO7F6SqlIG
— Allu Arjun (@alluarjun) December 6, 2019