హైదరాబాద్‌లో దిశపై అత్యాచారం, హత్య కేసులో నిందితులు..శుక్రవారం తెల్లవారుజామున చటాన్‌పల్లి వద్ద జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. సీపీ సజ్జనార్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు శుక్రవారం తెల్లవారుజామున పోలీసు ఎన్‌కౌంటర్లో చనిపోయారు. ఆ విషయం తెలిసిన తరువాత ‘దిశ’ తల్లి స్పందన ఆమె మాటల్లోనే: “ఆ అబ్బాయిలు ఒక్క నిమిషం ఆలోచన చేసిఉంటే.. నా అక్క, నా చెల్లిలాంటిదే కదా అని అనుకుని ఉంటే అక్కడ ఆ నలుగురు తల్లులు, ఇక్కడ నేను బాధపడాల్సి వచ్చేది కాదు.నేను ఎంత బాధపడుతున్నానో..వాళ్లకు ఇలా అయిందని. మా అమ్మాయి ఎంతో మంచిది. ఆమె ఎంతో మంచిగా ఆలోచించేది. ఆ మంచితనమే తనను తీసుకువెళ్ళిపోయిందేమో. నా గుండెలో ఎంత బాధ ఉందో చెప్పలేకపోతున్నా. ఈ బాధ అనుభవించేవాళ్ళకే తెలుస్తుంది. ఆనందం, బాధ..మా అమ్మాయి రాదు..వచ్చి ఉంటే బాగుండేది..ఇంకో తల్లి కడుపుకోత..ఇంకెవ్వరికీ రాకూడదు. మా అమ్మాయి బయటకు వస్తే ఎవరైనా చూస్తేనే ఫీల్ అయ్యే వ్యక్తి..ప్రపంచానికే తెలిసిపోయింది..ఆ అమ్మాయి పై నుంచి చూస్తుంది.. మాకు న్యాయం జరిగింది..పోలీసువాళ్లకు నమస్కారాలు..మా ఆత్మకు శాంతి కలిగింది. పోలీసు వాళ్లకు, మీడియాకు, మా కాలనీవాళ్లకు ధన్యవాదాలు..నిర్భయ కేసులో ఇంతవరకూ న్యాయం .జరుగలేదు..దిశ కేసులో కూడా ఏమి చేయరనుకున్నా… చేసి చూపించారని పోలీసులను, ప్రభుత్వానికి హ్యాట్సాఫ్.. ఇప్పటి నుంచి..ఎవరైనా అమ్మాయి వంక చూస్తే..అక్కడిక్కడే ఉరి తీసేలా చట్టాలు మార్పులు రావాలి…నాకు మా అమ్మాయి తప్ప..వేరే ఏమి లేదు..మేము ఎలా బతకాలండి..నేను తట్టుకోలేకపోతున్న అంటూ దిశ తల్లి అన్నారు.
