ఈ నెల 27న వైడురాలిపై నలుగురు మానవ మృగాలు అత్యాచారం చేసి, ఆ తరువాత హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత మృతదేహాన్ని చటాన్‌పల్లి వంతెన కింద కాల్చివేసారు. అయితే ఈ నిందుతులను ఎక్కడైతే కల్చేసారో అక్కడికి తీసుకెళ్ళి క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుండగా ఆ నలుగురు పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపేశారు. దాంతో నిందితులు నిందితుడుఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మరణించారు. ఈ సంఘటన శుక్రవారం నాడు తెల్లవారుజామున 3 గంటల సమయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సీక్రెట్ గా ఉంచడం జరిగింది.ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.