బీజేపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికలలో జనసేనతో పొత్తుపెట్టుకున్న కమ్యూనిస్టులు పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం తిరుపతితో మీడియాతో పవన్ మాట్లాడుతూ.. బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని తనకు వైసీపీ వాళ్లు చేతులెత్తి దండం పెట్టాలని అన్నారు. తాను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ ఎక్కడ ఉండేదన్న పవన్ కళ్యాణ్… అదే జరిగి ఉంటే… వైసీపీ అధికారంలోకి వచ్చేదా ? అని ప్రశ్నించారు. వైసీపీకి అమిత్ షా అంటే భయమన్న పవన్ కళ్యాణ్… తనకు మాత్రం షా అంటే గౌరవమని అన్నారు. తానెప్పుడూ బీజేపీకి దూరంగా లేనని తెలిపారు. హోదా విషయంలో మాత్రమే సిద్ధాంతపరంగా విబేధించాను కానీ..పార్టీని కాదు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కమ్యూనిస్ట్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో ఏ నాడు దూరం కాలేదని, కలిసే ఉన్నానని చెప్పిన పవన్ కల్యాణ్‌పై కమ్యూనిస్ట్‌లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి ఏనాడు దూరం కాకపోతే..మొన్నటి ఎన్నికల్లో తమతో ఎలా పొత్తుపెట్టుకున్నారని కమ్యూనిస్ట్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ, వామపక్షాలు రెండూ విభిన్న పార్టీలు…ఇరు పార్టీలకు అసలేమాత్రం పొసగదు.వాటితో ఒకేసారి కాపురం చేసి పవన్ తన నైజాన్ని బయటపెట్టుకున్నాడని కమ్యూనిస్ట్ నేతలంటున్నారు. వైవాహిక జీవితంలో లాగానే రాజకీయాలలో కూడా పవన్ మోసం చేస్తున్నాడని వారు అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలోకి వెళితే..ఒకపక్క రేణూదేశాయ్‌ను పెళ్లి చేసుకుని కాపురం చేస్తూనే..మరోపక్క రష్యన్ అమ్మాయితో కాపురం చేసి ఓ బిడ్డను కన్నాడు. ఈ విషయాన్ని రేణూ దేశాయ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇప్పుడు రాజకీయ జీవితంలో కూడా బీజేపీ అనే భార్యకు విడాకులు ఇవ్వకుండానే వామపక్షభార్యతో కాపురం చేసినట్లుగా ఉందని…కమ్యూనిస్ట్ నేతలు పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియల్ లైఫ్‌లోనే కాదు…రాజకీయకంగా కూడా పవన్‌ది ద్రోహం చేసే బుద్ధి అని కమ్యూనిస్ట్ నాయకులు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. మొత్తంగా బీజేపీతో సీక్రెట్‌గా రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తూనే..తమతో పొత్తు పెట్టుకుని పవన్ మోసం చేశాడని ఎర్రన్నలు వాపోతున్నారు. పాపం..కమ్యూనిస్ట్ నేతలు..పవన్ వాడకానికి బలైపోయారు.
