టీడీపీ కి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న గోదావరి జిల్లాలలో కూడా వలసలు మొదలయ్యాయి. జంగారెడ్డిగూడెం లో టీడీపీ పార్టీ నుంచి మూడు వందల మంది కార్యకర్తలు గురువారం వైఎస్సార్ సీపీలోకి చేరారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలకు ఆకర్షితులై వందలాదిగా వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. కేవలం ఆరు నెలల కాలంలోనే హామీలు అన్నీ నెరవేరుస్తున్నామని సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన పని చేయడం గర్వకారణంగా ఉందని అన్నారు.
జంగారెడ్డిగూడెం ను గ్రీన్ సిటిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం వంద పడకల ప్రభుత్వాసుపత్రి ఆధునీకరణ కోసం తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేశామని వెల్లడించారు. ఆరు కోట్ల రూపాయలతో డ్రైయిన్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ఎలీజా పేర్కొన్నారు. తమ ప్రభుత్వహయాంలో జంగారెడ్డిగూడెం ను సాధ్యమైనంత ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన తెలిపారు.