దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన సుమారు 15 నిమిషాల పాటు జరిగినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. నలుగురు నిందితులపై ఎన్‌కౌంటర్ శుక్రవారం తెల్లవారుజామున 5:45 గంటల నుంచి 6:15 గంటల మధ్య జరిగినట్లు ఆయన తెలిపారు. దిశను హత్య చేసిన ప్రాంతంలో పవర్ బ్యాంక్, సెల్‌ఫోన్, వాచ్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు సీపీ. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగానే నిందితులు పోలీసులపై దాడి చేశారు అని సజ్జనార్ పేర్కొన్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను 10 మంది పోలీసుల బృందం శుక్రవారం తెల్లవారుజామున దిశను హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లారు అని సీపీ సజ్జనార్ చెప్పారు. దిశ హత్య కేసులో సైంటిఫిక్ ఆధారాల కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాం. నిందితుల డీఎన్‌ఏ ప్రొఫైలింగ్ చేశాం. ఇతర రాష్ర్టాల్లోనూ బర్నింగ్ కేసులు ఉంటే.. వాటిల్లో ఈ నలుగురి పాత్ర ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు.
