ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం సీఎం నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి సాయంత్రం 6.15గంటలకు ఢిల్లీ ఏయిర్ పోర్ట్‌కు వెళ్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్ర 7 గంటలకు జన్‌పథ్-1కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేసి శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి అమరావతి చేరుకుంటారు. కాగా, గురువారం ఉదయం అనంతపురం వెళ్లిన సీఎం జగన్.. పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా ఫ్యాక్టరీ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కియా మోటర్స్ ప్లాంట్‌ను సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కియా మోటర్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కియా మోటార్స్ బాటలోలో మరికొన్ని కంపెనీలు ఏపీకి వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారు.
